ప్రకృతి సాగుపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు వ్యవపసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. స్థానిక వ్యవసాయాధికారి కార్యాలయంలో సోమవారం ఐ సీ ఆర్ పిల సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి కూల వాతావరణ పరిస్థితుల అధిగమించటానికి ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కోరారు. ఇప్పటి వరకు పీఎం డీఎన్ విత్తనాలు 1156 మంది రైతులకు 1272 ఎకరాలలో వేయించినట్లు చెప్పారు. కోఆర్డినేటర్/ నాగేశ్వర రావు, ఎఈఓ రాజ సుందరి తదితరులు పాల్గొన్నారు.
