తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

ముండ్లమూరు మండలంలోని పలు సచివాలయాలలో తల్లిపాల వారోత్సవాలు సోమవారం ప్రారంభమైనారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ వారం రోజుల పాటు అంగన్ వాడీ కేంద్రాల పరధిలో వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎన్ సూపర్ వైజర్ ఇందిర తెలిపారు. ఉల్లగల్లు సెక్టార్ పరిధిలోని ఉ ల్లగల్లు -1, లక్ష్మి నగర్, పెద్ద ఉల్లగల్లు – 2, పెద ఉల్లగల్లు-3, చిన ఉల్లగల్లు, కొత్తూరు, రెడ్డినగర్లలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఆరోగ్య, అంగన్ వాడీ కార్యకర్తలు రాధా ప్రియ, ప్రనన్న లక్ష్మి, సావిత్రి, గాలెమ్మ, విజయలక్ష్మి, చైతన్య భారతి, వెంకట రమణ, గ్రామ కార్యదర్శి పుష్పలత, మహిళా పోలీన్ శిరీష లు పాల్గొని తల్లి పాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయని చెప్పారు. ఆయా కేంద్రాలలో కిట్స్, గ్రుడ్లు, పాలు పౌష్టికాహారం అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *