ప్రకాశం పంతులు  155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన భాజపా మండల అధ్యక్షులు  వుటుకూరి మహేష్

    ఒంగోలు నగరంలోని  బంగారు వర్తకుల సముదాయం దగ్గర ఉన్న ప్రకాశం పంతులు గారి
విగ్రహానికి ఘనంగా 155 వ జయంతి వేడుకలను బిజెపి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు  . ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఊటుకూరు మహేష్   మాట్లాడుతూ.. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రకాశం పంతులు నిరుపేద పరిస్థితుల్లో దాతల సహకారంతో వారాలు చేసుకుంటూ లండన్‌లో ఉన్నత న్యాయ విద్యను అభ్యసించి బారిస్టర్‌గా పట్టా పొందారని తెలిపారు. అనంతరం నాటి మద్రాసు రాష్ట్రంలో న్యాయవాదిగా కొనసాగుతూ, మహాత్మా గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని తన జీవితాన్ని, సంపాదనను దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసి పోరాడారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా 13 నెలల పాటు పనిచేసిన ప్రకాశం పంతులు తన పదవీకాలంలో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. అయితే జీవిత చరమాంకంలో అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు.
సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో “కాల్చండి రా.. కాల్చండి” అంటూ తుపాకీ గుళ్లకు తన గుండెను చూపిన ధీరోదాత్తుడు ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆయన తెగువ, పోరాట పటిమ, జ్ఞానదీప్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లు విజయ రావు మరియు శివాజీ యాదవ్,  మండల మాజీ మండల అధ్యక్షులు గుర్రం రంగనాథం, తెలుగుదేశం నాయకులు అజయ్,  భూమా శ్రీనివాసరావు,  సత్యనారాయణ,  , ఆంజనేయులు,  చాలువది సత్యనారాయణ,  తదితరులు నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *