బేగంపేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) :
కారు డిక్కీలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు మాయమైన సంఘటన పై బేగంపేట
పోలీసు స్టేషన్ లో పిర్యాదు నమోదైంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రసూల్ పురా కు చెందిన సివిల్ ఇంజనీర్ మహేందర్ (55) మే 9న సికింద్రాబాద్ లోని సప్తగిరిటవర్స్ బాంకెట్ హాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యాడు. అనంతరం ఆయన భార్య సుమారు 12-13 తులాల బంగారు ఆభరణాలు ఆయనకు అప్పగించింది. ఇందులో రెండు నెక్లెస్లు, ఓ లాంగ్చైన్, మంగళసూత్రం, రెండు గాజులు, రెండు జతల చెవి టాప్స్ ఉన్నాయి. అయితే వాటిని మారుతి సియాజ్ కారులోని డిక్కీలో పెట్టిన మహేందర్ ఆ విషయాన్ని మర్చిపోయాడు. మే 16న ఇంటి వెనుక ఉన్న గ్యారేజీలో కారు సర్వీసింగ్కు ఇచ్చాడు. సుమారు నాలుగు రోజుల పాటు కారు గ్యారేజీలోనే ఉంది. అనంతరం కారును తిరిగి తీసుకున్నప్పటికీ డిక్కీలోని బంగారం విషయం గుర్తుకురాకపోవడంతో ఆభరణాలు కనిపించకపోవడాన్ని గమనించలేదు. జులై 2న రాత్రి భార్య ఆభరణాల గురించి అడగడంతో మహేందర్కు విషయం గుర్తొచ్చింది. వెంటనే కారుతో పాటు ఇంట్లో, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కారు గ్యారేజీలో ఉన్న సమయంలో పలువురికి వాహనంపై ప్రవేశం ఉండడంతో ఆ సమయంలోనే ఆభరణాలు మాయమై ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేస్తూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు డిక్కీలో భద్రపరిచిన బంగారు ఆభరణాలు మాయం..పోలీసులకు పిర్యాదు..
23
Aug