బేగంపేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్)
రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్న ఇద్దరిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నుంచి సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంతో పాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రసూలురా చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో బేగంపేట ఎస్ఐ శ్రావణ్‌కుమార్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో టీజీ 30 టీ 6198 నెంబర్ గల బొలెరో వాహనం సికింద్రాబాద్ వైపు వస్తుండగా పోలీసులను గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేసి వాహనాన్ని వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించాడు. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని పక్కకు ఆపించి తనిఖీ చేయగా అందులో పీడీఎస్ బియ్యం బస్తాలు బయటపడ్డాయి. డ్రైవర్ లావుడియా నితిన్ (23)ను విచారిచింగా వాహన యజమాని ధరావత్ రాముతో కలిసి కొంతకాలంగా రేషన్‌కార్డుదారుల నుంచి కిలో రూ.10ల చొప్పున పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించాడు. అనంతరం తండాలు, పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి కిలో రూ.15 నుంచి 18 వరకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలోనే పార్శిగుట్ట ప్రాంతం నుంచి పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి బొలెరోలో 80 బస్టాలు లోడ్ చేసుకుని తండాకు వెళ్తున్నట్లు డ్రైవర్ వెల్లడించాడు. మొత్తం 80 బస్టాల్లో 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, బొలెరో వాహనం, వన్‌ఫ్లస్ మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. నితన న్ను అదుపులోకి తీసుకోగా, వాహన యజమాని ధరావత్ రాము పరారీలో ఉన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు..బొలెరో వాహనం,మొబైల్ సీజ్.
23
Aug