ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.9.37 లక్షలు వసూలు…

బేగంపేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతి నుంచి రూ.9.37 లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడపకు చెందిన ఓ యువతి (27) బేగంపేటలోని చీకోటిగార్డెన్స్ రోడ్డులో నివసిస్తుంది.
ఆమె కళాశాల స్నేహితుడైన కురువ మనోహర్ తనకు ఉద్యోగం ఇప్పిస్తానని పదే పదే హామీనిస్తూ ఆమె నుంచి పలుమార్లు నగదు తీసుకున్నాడు. అతడిని నమ్మి డబ్బులు సమకూర్చేందుకు చివరకు తన బంగారాన్ని సైతం విక్రయించింది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు పలు విడదల్లో బ్యాంకు డిపాజిట్ల రూపంంలో మొత్తం రూ.9,37,358 లు చెల్లించింది. డబ్బులు తీసుకున్నప్పటికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు నగదు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *