శ్రావణమాసం సందర్భంగా పలు ఆలయాల్లో ఎమ్మెల్యే తలసాని పూజలు……ఎమ్మెల్యేను ఆలయాలకు ఆహ్వానించి ఘనంగా సత్కరించిన ఆలయ నిర్వాహకులు.

బేగంపేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎం న్యూస్) :
శ్రావణ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పలు ప్రాంతాలలో పర్యటించి పూజలు నిర్వహించారు. బోనాల పండుగను పురస్కరించుకుని రాంగోపాల్ పేట, బన్సీలాల్ పేట డివిజన్ లలోని పలు ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు.
రాంగోపాల్ పేట డివిజన్ లో….
రాంగోపాల్ పేట డివిజన్ లోని నల్లగుట్ట, f లైన్, c లైన్, కాచి బౌలి, వెంగల్ రావు నగర్ ప్రాంతాలలోని జూలమ్మ టెంపుల్, కొండ పోచమ్మ, కనకదుర్గమ్మ, గాలి మైసమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ, బాల త్రిపుర సుందరి, ముత్యాలమ్మ, భ్రమరాంబిక దేవాలయాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, నాయకులు కిషోర్, నరేందర్ రావు, ఆంజనేయులు, సతీష్, కొండాపురం మహేష్ యాదవ్, అరుణ్ భట్, గణేష్ తదితరులు ఉన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్ లో..
బోనాల పండుగ సందర్భంగాCC నగర్, క్లాస్ D, బి జె ఆర్ నగర్,
జయప్రకాష్ నగర్, న్యూ బోయగూడ, జయ నగర్, IDH కాలనీప్రాంతాలలోని నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ,ముత్యాలమ్మ, గాలి పోచమ్మ, లక్ష్మీ ఉప్పలమ్మ, గండెమ్మ, బాయి మైసమ్మ, అడివి మైసమ్మ, కాళీ మాత, తుల్జా భవాని,ఏడుపాయల కనకదుర్గమ్మ, దండు మారమ్మ తదితర దేవాలయాలను దర్శించిఅమ్మవార్లకు పూజలునిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పద్మారావు నగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ప్రేమ్, ఏసూరి మహేష్, రమణ, మహేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రాజేందర్, కుమార్ యాదవ్, లంక రాజు, కొత్తూరు వెంకట్, ఫహీం, అబ్బాస్, వినోద్, రంజిత్, ఎర్ర విజయ్, నాగభూషణం, గజ్జెల శ్రీనివాస్, ముక్కా శ్రీనివాస్, దేశపాక శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *