బన్సీలాల్ పేట ఆగస్ట్ 23,(జే ఎస్ డి ఎంన్యూస్ ) :
తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కోసం జిల్లా కన్వీనర్ల నియామకం జరిగింది.తెలంగాణముదిరాజుజర్నలిస్టుసంఘం రాష్ట్ర వ్యవస్థాపక
అధ్యక్షులు చింతల
నీలకంఠం, బోయిని శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్షులను ఎన్నుకోవడం కోసం ఉమ్మడి జిల్లాలుగా ఉన్న 10 జిల్లాల కన్వీనర్లను ఆదివారం ఎన్నుకొన్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు నీలకంఠం ముదిరాజ్ విలేకరులకు వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాద్ బోయిగూడ ముదిరాజ్ భవన సముదాయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కన్వీనర్లు గా ఉన్న వారు ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలుగా ఏర్పడిన జిల్లాలకు అధ్యక్షుల నియామకం జరిగే క్రమంలో వారి బాధ్యతను నిర్వహించడానికి ప్రస్తుతం కన్వీనర్లను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కన్వీనర్ గా బాపట్ల కృష్ణమోహన్ ముదిరాజ్ , కో కన్వీనర్ గా గడ్డమీది శ్రీశైలం ముదిరాజ్ లను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కన్వీనర్
జి .నర్సింలు ముదిరాజ్ నారాయణపేట జిల్లా కన్వీనర్ గా నవీన్ ముదిరాజ్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గా ,
పరమేశ్వర ముదిరాజ్ కో కన్వీనర్ గా బరిగే నర్సింలు. ముదిరాజ్ నిర్మల్ జిల్లా కన్వీనర్ గా హనుమాన్లు ముదిరాజ్.సంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా ఏ. రాంబాబు కో కన్వీనర్ గా గోవర్ధన్ ముదిరాజ్ మెదక్ జిల్లా కన్వీనర్ గా వెంకటేశం ముదిరాజ్ కరీంనగర్ జిల్లా నేదురు సమ్మయ్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్ సుమన్ ముదిరాజ్ నల్గొండ జిల్లా కన్వీనర్ గా సైదులు ముదిరాజ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల నుండి
తరలి వచ్చిన ముదిరాజు జర్నసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
