ఒంగోలు భాగ్యనగర్ లోని ఈవీఎం గోదాములను తనిఖీ

నెలవారీ తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్పి రాజాబాబు మంగళవారం ఒంగోలు భాగ్యనగర్ లోని ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. గోదాముల తలుపులకు వేసిన సీల్ పరిశీలించారు. ఈ ప్రాంగణంలో కల్పించిన భద్రత, నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట డిఆర్ఓ పి.వెంకటరమణ, జిల్లా ఎన్నికల విభాగ అధికారి శ్రీనివాసరావు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *