బేగంపేట ఆగస్ట్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని ఎట్టకేలకు అధికారులు సీజ్ చేశారు.బిల్డింగ్ మాత్రమే అక్రమ నిర్మాణం అనుకుంటే ఆ బిల్డింగ్ లో నడుస్తున్న హాస్పిటల్ కూడా అక్రమమే అని అధికారులు గుర్తించారు.ఒక పేరుతో అనుమతి పొంది మరో పేరుతో ఆస్పత్రి నడుపుతున్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు.బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్ లోని శ్రీ భక్త హనుమాన్ దేవాలయం పక్కనే ఉన్న భవనానికి జి ప్లస్ 2 మాత్రమే అనుమతులు ఉన్నాయి.అయితే నిర్మాణ దారుడు జీ ప్లస్ 4 ప్లస్ పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు.దీంతో పాటు ఆ బిల్డింగ్ లో ఎస్ వి రీ బర్త్ హాస్పిటల్ ను నడుపుతున్నారు.
అయితే అనుమతుల కోసం మాత్రం మరో పేరును ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు.దీంతో పాటు ఆస్పత్రి కి పక్కనే దేవాలయం,వెనుక వైపు పాఠశాల,నివాసాల మద్యలో ఉండటంతో స్థానికులు ఈ ఆస్పత్రిని తరలించాలంటూ సి ఎం ప్రజావాణి లో పిర్యాదు చేశారు.దీంతో ప్రజావాణి అధికారులు ఈ విషయాన్ని బోయిన్ పల్లి జీ హెచ్ ఎం సి అధికారులకు సమాచారం పంపారు.బిల్డింగ్ ను పరిశీలించిన బోయిన్ పల్లి టౌన్ ప్లానింగ్ ఏ సి పి కుర్మయ్య బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ సీజ్ చేశారు.ఆసుపత్రికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ ను కూడా రోడ్డు పైనే పిల్లర్ వేసి ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
భవనం మొత్తాన్ని సీజ్ చేస్తూ బ్యానర్ ను సైతం అధికారులు ఏర్పాటు చేశారు.
