జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు తాళ్లూరు మండల వైసీపీ నాయకులుజన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్లు కట్ చేసి, శాలువాలు, పూల మాలతో, బొకేలతో ఆమెను చీమకుర్తి, ఒంగోలులో కలిసి ఘన సన్మానం చేసారు. ముందుగా దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి స్మృతి మందిరం వద్ద ఆయనకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లివెంకాయమ్మ, వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, వారి కుటుంబసభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, రాష్ట్ర మేధావుల సంఘ ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బా రెడ్డి, కార్యదర్శి మారం ఇంద్రసేనా రెడ్డి, ఉపాధ్యక్షుడు పులి ప్రసాద్ రెడ్డి, ముచ్చుమారి బ్రహ్మా రెడ్డి, పులి బ్రహ్మా రెడ్డి, పులి క్రిష్ణా రెడ్డి, సోము అనిల్, కైపు ఆశోక్ రెడ్డి, గుజ్జుల యోగి రెడ్డి, నంగు కొండా రెడ్డి, కుమ్మిత శ్రీనివాస రెడ్డి, లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ నర్పంచిలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

