ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి –…..జన విజ్ఞాన వేదిక

జన విజ్ఞాన వేదిక ఉమ్మడి ఉమ్మడి జిల్లా శాఖల ఆధ్వర్యంలో కనిగిరిలోని హానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఉచిత ఆరోగ్య అవగాహన కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో “టెన్షన్ లేకుండా బతకడం ఎలా?” అనే అంశంపై వెన్నపూస బ్రహ్మారెడ్డి, “మన ఆరోగ్యం – జీవనశైలి మార్పులు” అనే అంశంపై కొల్లా నాగేశ్వర రావు ప్రజలకు, విద్యార్థులకు ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వైద్య నిపుణులు మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవడం, తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి, శారీరక వ్యాయామం ఆరోగ్యకరమైన జీవితానికి ఎంతో అవసరమని వివరించారు. ఆరోగ్యానికి సంబంధించిన అపోహలను నమ్మకుండా శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
జన విజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడం, మూఢనమ్మకాలను తొలగించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షులు గయాజ్, రాష్ట్ర విద్యా కమిటీ కన్వీనర్ డా ప్రత్యూష సుబ్బారావు, రాష్ట్రప్రధాన కార్యదర్శి విశ్వ నాథ్ , ఉపాధ్యక్షులు కొల్లా మధు, కొమ్మిరెడ్డి కొండమ్మ, మీనా, ప్రకాశం జిల్లా అధ్యక్షులు చిన్నాజీ, ప్రధాన కార్యదర్శి కె.టి.సి. పాపారాయుడు, రిటైర్డ్ ప్రిన్సిపల్ రమణా రెడ్డి, హానీ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణారెడ్డి, వక్త కన్వీనర్ శేషా రెడ్డి, వెలుగొండ సాధన సమితి కన్వీనర్ శ్యాం సుందర్, డప్పు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *