శాంతి, ప్రేమ ,ఆనందం సమాజానికి పంచాలని ఉద్దేశంతో మానవతా సేవా సంస్థ ముందుకెళ్తుందని సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్.రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం పొదిలి మానవతా సేవా సంస్థ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా సమాజానికి సేవ చేయాలనేదే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఎంతోమంది మానవతావాదులు, దాతలు ముందుకొచ్చి సంస్థలో సభ్యులుగా చేరి సంస్థ ద్వారా సమాజానికి అవసరమైన సేవలు అందిస్తున్నారన్నారు. పొదిలి మానవతా శాఖ చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. పొదిలి శాఖలో సేవా కార్యక్రమాలకు తమవంతుగా సహకారమందిస్తున్న ఏపీ ఆర్ గ్రూప్ అధినేత ఆవుల కృష్ణారెడ్డి, భవాని శ్రీనివాసులు మరికొందరి దాతల సేవలు అభినందనీయమన్నారు. అనంతరం మానవతా సేవా సంస్థ నూతన జిల్లా అధ్యక్షులుగా ఎం పార్థసారథి, జిల్లా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మువ్వల పార్థసారథి మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని శాఖల ఏర్పాటుకు సమాజానికి మరిన్ని సేవలు కొనసాగింపుకు కృషి చేస్తానని తెలిపారు. ముందుగా పొదిలి పట్టణంలో ప్రపంచ శాంతిని కోరుతూ మానవతా సేవా సంస్థ ప్రతినిధులు , సభ్యులు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. శివాలయం ఆవరణలో పంచాయతీ కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. ఎస్ వి కె పి డిగ్రీ కళాశాల వ్యవస్థాపకులు దివంగత మువ్వల శ్రీహరిరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. మూడు కుటుంబాలకు ఏపీఆర్ గ్రూప్స్ అధినేత ఆవుల కృష్ణారెడ్డి చేతుల మీదుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా సేవా సంస్థ పొదిలి చైర్మన్ కాటూరి వెంకట నారాయణ బాబు, మాజీ జిల్లా అధ్యక్షులు కాకునూరి యలమందారెడ్డి, పొదిలి మండల కన్వీనర్ కల్లం వెంకట సుబ్బారెడ్డి, అధ్యక్షులు సోమిశెట్టి చిరంజీవి, సెక్రటరీ చిత్తంశెట్టి వెంకటకృష్ణారావు, కోశాధికారి బండి అశోక్, ఉపాధ్యక్షుడు సుమంత్, మాజీ అధ్యక్షులు కే ఎలమందరెడ్డి
ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణారావు ,మహిళా ప్రధాన కార్యదర్శి ఎర్రంపల్లి కిరణ్మయి ,మహిళా నాయకురాలు వరికూటి శిరీష, కార్యాలయ స్థల దాత వెలిశెట్టి వెంకటేశ్వర్లు, బండి అశోక్, వినోద్ రాజు, మామిడి వెంకటేశ్వర్లు ,మేడ నరసింహారావు, భూమా సుమంత్, రావూరి ప్రసాదు,
రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన మానవత సంస్థ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు చైర్మన్లు కన్వీనర్లు పొదిలి పట్టణ సభ్యులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

