అడ్డగుట్ట సెప్టెంబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణేశులను ప్రతిష్టించి పూజించాలని అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ అన్నారు. అడ్డగుట్ట మాజీ కార్పొరేటర్ కార్యాలయం వద్ద ఆదివారం ఆమె ప్రజలకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలర్స్, కెమికల్స్ తో తయారు చేసిన విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని ఆమె తెలిపారు. కావున పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాని శ్రీనివాస్, దేవయ్య, రామప్ప, అబ్బమ్మ, భాస్కర్, రాజు, వెంకటేశ్, పరుశురాం , యాదగిరి, సుధాకర్, కిరణ్, రాము, శంకర్, పెద్ద ఎత్తున బస్తివాసులు పాల్గొన్నారు.
