జూబ్లీ హిల్స్ సెప్టెంబర్ 13,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మా ఇంట ప్రతి ఏటా పూజలు అందుకునేది మట్టి గణ పతే అని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ అన్నారు.
ప్రతి ఒక్కరు మట్టిగణపతిని పూజించాలని, తాము కూడా మట్టిగణపతి నే పూజిస్తా అని ఆయన తెలియ జేశారు. ఆదివారం రాత్రి శ్రీ వాసవి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మట్టి గణపతిని ఆయన అందుకున్నారు. గత కొన్నేళ్ళుగా మట్టి గణపతులను అందరికీ అందజేస్తూ అవగాహన కల్పిస్తున్న తీరుపై నవీన్ యాదవ్ ప్రశంసించారు. మట్టిగణపతి ప్రతిష్టించి ఆధ్యాత్మిక వాతావరణం తీసుకురావడంఅభినందనీయమన్నారు. గణపతి విగ్రహం మంచి కళగా ఉందని, ఈ సందర్భంగా శ్రీ వాసవీ యువజన సంఘం చేస్తున్న సేవలు
అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కు మట్టి గణపతి అంద జేసిన వారిలో సంస్థ ప్రతినిధి పుట్టా రామకృష్ణ, కొండారావు, సూర్య, సాయి, రాజారావు, రెడ్డి బాబు, నాగరాజు, మహేష్, సాయి, లక్ష్మీరావు తదితరులు పాల్గొన్నారు.
