బేగంపేట సెప్టెంబర్ 14,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉదయం లిటిల్ బేగంపేట లోని ఒక నిర్మాణం లో ఉన్న భవనం వద్ద ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి.భవనంలో వున్న చెక్కలు, పెయింట్ డబ్బాలు విద్యుత్ కేబుల్స్ తదితర వస్తువులు ఉండటంతో మంటలు అంటుకుని భారీగా నల్లని పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి.దీంతో పక్కనే ఉన్న ఇళ్ల వారు కూడా తీవ్రమైన పొగతో ఇబ్బంది పడ్డారు.సుమారు గం6.15 వచ్చిన మంటలు,పొగలు 7.50 వరకు వచ్చాయి. స్పందించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియ జేయటంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు అర్పివేసింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.సకాలంలో అక్కడకు చేరుకున్న పోలీసు లు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.ఆస్తి నష్టం ఎంత అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


