బేగంపేట సెప్టెంబర్ 14,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వానొచ్చిందంటే బేగంపేట,ప్రకాశం నగర్ పరిధిలోని పలు బస్తీలు వణుకు తున్నాయి.వర్షం బేగంపేట లో కురవక పోయినా కూకట్ పల్లి,బాలానగర్,ఫతే నగర్ ,అమీర్పేట ప్రాంతాల్లో వర్షం కురిసిందంటే చాలు.కూకట్ పల్లి,అమీర్ పేట నాలాల్లో నీటి ఉదృతి పెరుగుతుంది.దీంతో బేగంపేట డివిజన్ పరిధిలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తీ ,బ్రాహ్మణ వాడి,వడ్డెర బస్తీ,మాతాజీ నగర్,లతో పాటు ప్రకాశం నగర్ డివిజన్ పరిధిలోని అల్లంతోట బాయి,మయూరి మార్గ్, చికోటీ గార్డెన్,ప్రకాశం నగర్ ఎక్స్టెన్షన్ ,శ్యాం లాల్ బిల్డింగ్ తది తర ప్రాంతాల్లో నాలా నీరు బస్తీలను ముంచెత్తుతున్నాయి.దీంతో ఇళ్లలోకి నీరు ,మురుగు చేరి స్తానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితులు నెలకొంటున్నా ప్రజాప్రతినిధులు,అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో విఫల మవుతూనే ఉన్నారని పై ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వాలు మారుతున్నా, నాలా పరివాహక బస్తీల పరిస్థితి లో ఏ మాత్రం మార్పు రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు.బేగంపేట, ప్రకాశ్ నగర్ డివిజన్లలోని పలు బస్తీల్లో వర్షపు నీరు నిల్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది.
ఇప్పటి కైనా ప్రజా ప్రతినిధులు,అధికారులు మేల్కొకపోతే ముంపు ముప్పు లోనే బస్తీల ప్రజలు గడపాల్సిన దుస్థితి ఉందని వారు వాపోతున్నారు.ప్రకాశం నగర్ పరిధిలోని గుండ్ల నరసింహ స్వామి ఆలయం గల్లీ లో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి భారీగా నీరు నిలిచిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.శ్యాం లాల్ బిల్డింగ్ జంక్షన్ లో గణపతి ఆలయం జంక్షన్ లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడం తో భక్తులు,స్టానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.దీంతో పాటు అమీర్ పేట,కూకట్ పల్లి నాలా మధ్య ఉన్న బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో వర్షాకాలం,ఎండాకాలం అనే తేడా లేకుండా నాలా నీరు బస్తీలో చేరి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది.ఏడాది పాటు ఈ బస్తీలో మురుగు నీరు ఎక్కడి కక్కడ నిలిచిపోయి దోమల దాడితో బస్తీలో జ్వరాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత బస్తీల్లో బ్లీచింగ్, ఫాగింగ్ కూడా చేయడం లేదని పై బస్తీల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా బేగంపేట ప్రకాశం నగర్ డివిజన్ల పరిధిలోని పై బస్తీలలో నాలా నీరు ఇళ్లలోకి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పై బస్తీల ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారులను కోరుతున్నారు.



