మానవత సంస్థ “సెంట్రల్ కన్వీనర్”గా కపురం శ్రీనివాసరెడ్డి .

     మానవత స్వచ్ఛంద

సేవాసంస్థ సెంట్రల్ కన్వీనర్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(IRCS)ప్రకాశం జిల్లా ఎగ్జికూటివ్ మెంబరు,ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సుపరిచితులైన కపురం శ్రీనివాసరెడ్డి నియమించబడ్డారు.
ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…. మానవతా సంబంధాలు, విలువలు పూర్తిగా అంతరించిపోతున్న ప్రస్తుత ఈ సమాజంలో, మహోన్నతమైన విలువలు,ఆశయాలుగలిగిన మానవత స్వచ్ఛంద సేవాసంస్థను, సేవాతత్పరులు ఎన్.రామచంద్రారెడ్డి స్థాపించారని, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో 147 శాఖలలో 98వేలమంది సభ్యులను కలిగి,నిరుపేదలకోసం,ఆపదలోవున్న అభాగ్యులకోసం నిరంతరం ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా సేవచేస్తూ ప్రజలకుచేరువైన సంస్థగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపుపొందిన ఏకైక స్వచ్ఛంద సేవాసంస్థగా మానవత సంస్థ ఆవతరించిందని సంస్థ సేవలను కొనియాడారు. ఈ సంస్థలో ఎందరో విద్యావంతులు,కార్మికులు,ఉద్యోగులు,మేధావులు సభ్యులుగా చేరి, నిరంతరమూ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా సమాజంలో ఆనేక రుగ్మతలను అధిగమించి, ఉచితంగా ఎవరూ చేయని,చేయలేనటువంటి మహోన్నత విలువలుగలిగిన సేవలు చేస్తున్నారని,వారి సేవలు అమూల్యమైనవని, ఈవిధంగా సేవచేస్తున్న సేవాతత్పరులకు సమాజంలోని ప్రతీ ఒక్కరూ సహకారాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా వుందని గుర్తుచేశారు.
ఈ విధంగా ఎంతోమంది దుఃఖంలోవున్న అభాగ్యుల కొరకు,ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకొరకు, నిరంతరం కుల,మత,రాజకీయపార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా పరితపిస్తున్న మానవత స్వచ్ఛంద సేవాసంస్థను సమాజంలోని ప్రజలందరూ ఆదరించి,నవ శాంతిసమాజ నిర్మాణానికి అందరి తోడ్పాటు,సహయం అవసరమని, దుఃఖంలోవున్నవారి చివరి కన్నీటిబొట్టునైనా ఆపగలిగే ప్రయత్నమే మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ధ్యేయమని కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *