బేగంపేట సెప్టెంబర్ 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో వృక్ష సంరక్షణ మరియు హరిత నగరం దిశగా మరో ముందడుగు కు తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు ఆధ్వర్యంలో జేశారు.ఖార్ఖానా లో రోడ్డుపై ట్రాఫిక్ కి అడ్డుగా ఉన్న మర్రి చెట్టు కు బైసన్ పోలో మైదానంలో పునరజ్జీవంచేశారు. కూడళ్ల అభివృద్ధి మరియు ట్రాఫిక్ నిర్వహణ చర్యల్లో భాగంగా, ట్రాఫిక్ ఏ సి పి మర్రి చెట్టు ను ఖార్ఖానా పాత పోలీస్ స్టేషన్ ముందు నుంచి తొలగించి బైసన్ పోలో మైదానంలో నాటారు. నిత్యం వేలాది వాహనాల రద్దీతో ఉండే ఈ మార్గంలో చెట్టు వాహనదారులకు ఆటంకంగా మారిందని గుర్తించిన ట్రాఫిక్ అధికారులు ఈ చర్యలను చేపట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు, ట్రాఫిక్-I, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. రాహుల్ రెడ్డి,ల పర్యవేక్షణలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర రాజు ఆధ్వర్యంలో పెద్ద చెట్టును సంరక్షించి, అది నిరంతరం పెరిగేందుకు అనువైన ప్రదేశానికి తరలించారు.
మర్రి చెట్టును ప్రస్తుత ప్రదేశం నుండి అత్యంత జాగ్రత్తగా మరియు శాస్త్రీయ పద్ధతిలో తొలగించి, బైసన్ పోలో గ్రౌండ్‌కు విజయవంతంగా తరలించి నాటారు.చెట్టుకు ఎటువంటి నష్టం కలగకుండా, కొత్త ప్రదేశంలో అది ఆరోగ్యంగా పెరిగి జీవించేలా ఈ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు.ఈ పర్యావరణహిత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన సంబంధిత శాఖల అధికారులు మరియు సిబ్బందికి తిరుమలగిరి ట్రాఫిక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.


