బాలాపూర్‌ నుంచి శోభాయాత్ర మార్గాల పరిశీలన.ఉన్నతాధికారులతో కలిసి బస్సు యాత్ర ద్వారా పరిశీలించిన హైదరాబాద్ నగర సీపీ సజ్జనర్.

హైదరాబాద్ సెప్టెంబర్ 15,(జే ఎస్ డి ఎం న్యూస్) :
వినాయక నిమజ్జన శోభాయాత్ర వేళ నగరంలో భక్తులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, హైడ్రా , ఆర్ ఆండ్ బి ఉన్నతాధికారుల బృందం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో బస్సులో పర్యటించి చేపట్టాల్సిన చర్యలను గుర్తించారు. బాలాపూర్‌ గణనాథుడి సన్నిధి నుంచే మంగళవారం ఉన్నతాధికారులంతా కలిసి ప్రత్యేకంగా బస్సు యాత్ర ప్రారంభించి, శోభాయాత్ర సాగే ప్రధాన రహదారులు, అక్కడ చేపట్టిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
అంతకుముందు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌, ఐపీఎస్, హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్.వి.కర్ణన్, హైదరాబాదు కలెక్డర్ డా.ప్రియాంక ఆలా , తదితరులు బాలాపూర్‌ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాపూర్‌ వినాయక ఉత్సవ సమితి నిర్వాహకులు కళ్ళెం నిరంజన్ రెడ్డి, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి జి.రాఘవ రెడ్డి, ఆర్.శశిధర్ లు ఉన్నతాధికారులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సీపీ సజ్జనర్‌మాట్లాడుతూ నగర ప్రజలకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, స్థానిక నిర్వాహకులు దశాబ్దాలుగా ప్రభుత్వానికి, పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కొనియాడారు. నిమజ్జనం రోజున నగరవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలుచోటుచేసుకోకుండా దాదాపు 20 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.నగరమంతటా ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి నిరంతరంపర్యవేక్షిస్తామన్నారు.ఈసారి బాలాపూర్‌లో పూరీ జగన్నాథ ఆలయ నమూనాతో గణనాథుని మండపాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని ఉత్సవ సమితి సభ్యులను అభినందించారు.
దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్‌ శోభాయాత్రను విజయవంతం చేసేందుకు నగర ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు పోలీసు శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ఊరేగింపు మార్గము బాలాపూర్ గణేష్ మండపము నుండి ప్రారంభమై, మొత్తం 19 కి.మీ. పొడవున ఉన్న ఈ మార్గంలో చంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, ఎం.జే. మార్కెట్ మరియు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు తనిఖీ నిర్వహించారు. గణేశ్ ఉత్సవాల గురించి గత నెలరోజులుగా అన్ని శాఖల సమన్వయముతో పనిచేస్తూ ముందుకు వెళ్ళుతున్నాము అని తెలిపారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గంలో అధికారుల బృందం రాజేష్ మెడికల్ హాల్, గుల్జార్ హౌస్, ఎం.జే. మార్కెట్ జంక్షన్, తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఆగి నిశితంగా పరిశీలించారు. ప్రతి జోన్ అధికారులు తమ పరిధిలోని విగ్రహాలను సకాలంలో నిమజ్జనానికి బయలుదేరే విధంగా చూడాలని తెలిపారు. ప్రస్తుతము వర్షాలు పడుతున్నందున విద్యుత్తు షాక్ గురి అయ్యే అవకాశము ఉన్నందున మండప నిర్వాహకులకు అందరికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీచేసినట్లు తెలిపారు.
గణేష్ విగ్రహాల ఊరేగింపు మార్గంలో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, యాంటీ-చైన్ స్నాచింగ్ బృందాలు మరియు షీ టీమ్‌లను కూడా మోహరించనున్నామని తెలిపారు. నిమజ్జనము రోజున జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, వాటర్ వర్క్స్, ఆర్‌టీఏ, వైద్య మరియు ఆరోగ్య శాఖ వంటి విభాగాల సీనియర్ అధికారులు ఉమ్మడి కమాండ్ కంట్రోల్ సెంటర్ టీజీఐసీసీసీలో అందుబాటులో ఉంటారని తెలిపారు.ఈ సంవత్సరం గణేష్ విగ్రహాల ఊరేగింపు మరియు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మరియు ప్రజలు, భక్తులు ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసు వారితో
సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్‌ సీపీ (శాంతిభద్రతలు) తఫ్సీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ (ట్రాఫిక్‌) డి.జోయల్‌ డేవిస్‌, .ఖారె కిరణ్ ఎస్.శ్రీనివాస్,.ఆర్.వెంకటేశ్వర్లు కె.శిల్పావల్లి ,రాహుల్ హెడ్గే.అవినాశ్ కుమార్, కాజల్ సింగ్ శంషాబాద్‌ డిసిపి .బి.రాజేశ్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *