సికింద్రాబాద్ సెప్టెంబర్ 15 (జే ఎస్ డి ఎం న్యూస్)
వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ బోయిగూడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ , మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ ,డివిజన్ నాయకులు అసోసియేషన్ నిర్వాహకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం మండప నిర్వాహకులు ఎమ్మెల్యే ని,శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,అసోసియేషన్ సభ్యులు, సంఖ్యలో పాల్గొన్నారు.
