19న మెగా శానిటేషన్ డ్రైవ్…. ‘ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో నిలిచేలా నిర్వహణ…. అధికారులకు కలెక్టర్ రాజాబాబు దిశా నిర్దేశం…. ఎమ్మెల్యే జనార్దన్, ఒనుడా చైర్మన్ రియాజ్ తో ప్రత్యేక సమావేశం

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా ఈ నెల 19వ తేదీన ‘ మెగా శానిటేషన్ డ్రైవ్ ‘ నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ మరియు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ షేక్ రియాజ్ లతో కలిసి మంగళవారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు వారు దిశానిర్దేశం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నిర్వహణ ఇలా….

       మున్సిపాలిటీ పరిధిలోని 80 వేలకు పైగా ఉన్న ఇళ్ల నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా సేకరించేలా ప్రతి ఇంటికీ ప్రత్యేక నంబర్లతో కూడిన 2 కవర్లను ముందుగానే పంపిణీ చేయాలని కలెక్టర్ చెప్పారు. మెగా శానిటేషన్ డ్రైవ్ రోజున చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించేలా ప్రతి 50 ఇళ్లకు ఒకరిని కేటాయించాలని, వీరిపైన పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించాలని చెప్పారు. చెత్త తరలింపునకు కూడా ప్రత్యేక వాహనాల కేటాయింపు, వాటికి మార్గాన్ని నిర్దేశించడంలోనూ ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ శానిటేషన్ డ్రైవ్ ' బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ' లో నిలిచేలా చేపట్టాలన్నారు. ఇందుకోసం మున్సిపాలిటీ, మెప్మా ఇబ్బందిని వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఐదుగురు జిల్లాస్థాయి అధికారులను కూడా పరివేక్షించేలా నియమిస్తామన్నారు. 

ప్రజలకు విస్తృత అవగాహన

      మెగా శానిటేషన్ డ్రైవ్ పైన ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేయాలని, ఫ్లెక్సీలు, హోర్డింగులతోనూ అవగాహన కల్పించాలని జనార్దన్, రియాజ్ సూచించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. చెత్తను సేకరించే ప్రక్రియలో ఇంజనీరింగ్ విద్యార్థులను కూడా వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ డ్రైవ్ అనంతరం వ్యర్ధాల నిర్వహణలో ఇదే స్ఫూర్తిని కొనసాగించేలా ప్రతి ఇంటికి ' మన ఒంగోలు - మన గౌరవం ' నినాదంతో ప్రింట్ చేయించిన 2 ప్రత్యేక డస్ట్ బిన్నులు కూడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు చెప్పారు. ఒంగోలు మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలను పురస్కరించుకొని నగరం మొత్తం విద్యుత్ దీపాలంకరణ చేపట్టాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
        మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణయ్య, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మున్సిపల్ ఇంజనీర్ యెషయా, డి.ఈ.ఈ. పద్మజ, హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *