తాళ్లూరు: ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు మండలంలో 46 పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పి. అజిత తెలిపారు. స్థానిక ఎంపీడీవో చాంబర్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధం చేసిన ముసాయిదా జాబితాపై అన్ని పార్టీల నాయకులతో ఎంపీడీవో పి. అజిత అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో అజిత మాట్లాడుతూ మండలంలోని 37,971 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఒక్కో పోలింగ్ బూత్కు నగటున 825 మంది ఓటర్లు నమోదు చేసామని చెప్పారు. గతంలో 42 పోలింగ్ బూత్లు ఉన్నాయని, ఓట్ల సంఖ్యను బట్టి అదనంగా 4 పోలింగ్ స్టేషన్లను కొత్తవాటిని ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. గతంలో వున్న పోలింగ్ బూత్ కు అనుగుణంగానే మార్పు చేయటం జరిగిందని అన్నారు. సర్ నిబంధలకు అనుగుణంగా కొత్తగా దోసకాయలపాడు, బొద్దికూరపాడు, తూర్పుగంగవరం, లక్కవరం గ్రామాల్లో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. బొద్దికూరపాడు హైస్కూల్లో పోలింగ్ బూత్ వల్ల ఎస్సీ కాలనీవాసులు కిలో మీటర్ దూరం వెళ్లలేక పోతున్నందున ఎస్సీకాలనీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని, దోసకాయలపాడుకు తోటవెంగన్నపాలెం 2.5 కిలో మీటర్ల దూరంవుందని, దోసకాయలపాడు ఓటుకు వెళ్లేందుకు వృద్ధులు, వికలాంగులు, మహిళలుతీవ్ర ఇబ్బందులు పడుతున్నందున ఆరెండు గ్రామాల్లో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేయాలనిపలువురు నాయకులు అధికారుల దృష్టికితీసుకు వచ్చారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుక వెళ్లి తగు చర్యలు చేపడతా మని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మేడగంవెంకటేశ్వరరెడ్డి, జనసేన నేత జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, మండల వైసీపీ అధ్యక్షులు టీవీ సుబ్బారెడ్డి, మండలబిజేపీ అధ్యక్షులు ఏ. కోటేశ్వరరావు, మండలజనసేన అధ్యక్షులు కె.ప్రసాద్, టీడీపీ నేతలుమానం రమేష్ బాబు ఐ.వెంకటేశ్వర రెడ్డి, పి.రమణారెడ్డి వైసీపీనాయకులు ఎల్ వెంకటేశ్వరరెడ్డి, కె. కృష్ణారెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

