‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ విజయవంతంగా నిర్వహించడంలో సచివాలయ ఉద్యోగులు కూడా చురుకైన పాత్ర పోషించాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

ఈనెల 19వ తేదీన నిర్వహించే ‘ మెగా సెగ్రిగేషన్ డ్రైవ్ ‘ విజయవంతంగా నిర్వహించడంలో సచివాలయ ఉద్యోగులు కూడా చురుకైన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని సచివాలయాల సిబ్బందితో బుధవారం సాయంత్రం రిమ్స్ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం ఉన్న ఒంగోలు నగరాన్ని ఒక ఐకానిక్ సిటీగా యావత్ ప్రపంచానికి తెలిసే రీతిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ‘ మీరు పని చేస్తున్న నగరానికి ఈ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత మీపైనా ఉంది ‘ అని ఉద్యోగులలో స్ఫూర్తిని నింపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భాగస్వాములకు లక్కీ డ్రా

   ప్రతి కుటుంబం ఈ డ్రైవ్ లో పాల్గొనేలా అవగాహన కల్పించాలని సచివాలయ ఉద్యోగులకు కలెక్టర్ సూచించారు. శానిటరీ డివిజన్ల వారీగా భాగస్వాముల వివరాలతో లక్కీ డ్రా తీసి, విజేతలకు గోల్డ్ కాయిన్ ఇస్తామని ఆయన ప్రకటించారు. 

         ఈ సమావేశంలో మెప్మా పీడీ నారాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, అసిస్టెంట్ కమిషనర్ నగేష్, మున్సిపల్ ఇంజనీర్ యెషయా, డీ.ఈ.ఈ. పద్మజ, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *