ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రతి ఇంటి ముందు ‘ఆశీర్వాద దీపం’ వెలిగించాలని భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిండి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పి.ఎం
మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ఆశీర్వాదాలు అందించాలని ఆయన కోరారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం మోదీ చేస్తున్న కృషికి తమ ఆశీస్సులు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.
సెప్టెంబర్ 17న ప్రతి ఇంటా దీపం వెలిగించి ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి కోరారు .
