ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌కు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం…

హైదరాబాద్ సెప్టెంబర్ 17,(జే ఎస్ డి ఎం న్యూస్)
భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. గురువారం నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన తెలంగాణా విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు ఉప రాష్ట్ర పతి నగరానికి వచ్చారు.ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ స్వాగత కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వీడ్కోలు::

అనంతరం నగర పర్యటనను ముగించుకుని తిరిగి బయలుదేరిన ఉపరాష్ట్రపతికి బేగంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీలు, బీజేపీ ప్రముఖులు వీడ్కోలు పలికారు. ఈ స్వాగత, వీడ్కోలు కార్యక్రమాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *