బేగంపేట సెప్టెంబర్ 17,(జే ఎస్ డి ఎం న్యూస్) :
బేగంపేట పరిధిలోని ఎన్ బి టి నగర్ లో గణేష్ మండపం వద్ద గలీజు నీళ్ళు ప్రవహిస్తుండటం భక్తులను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేస్తుంది.వినాయక విగ్రహం కింద ,పక్కన మురుగు పరుగు తీస్తుండటం తో పాటు పరిసరాలు తీవ్ర దుర్గంధం వెదజల్లు తుండటం సంబంధిత శాఖాధికారులు ఎవరుపట్టించుకోకపోవడంతో భక్తులు,స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో అమార్గంలో వాహనాల రాకపోకల సమయంలో మండపం పై మురుగు నీరు చిమ్ము తుండని ,సమస్య ను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు అని భక్తులు హెచ్చరిస్తున్నారు.ఎంతో భక్తితో తాము వినాయకుడిని ఏర్పాటు చేసుకున్నామని మొదటి రోజు పూజ ప్రారంభించగానే డ్రైనేజ్ నుంచి మురుగు నీరు బయటకు పారుతుందని, ఈ విషయాన్ని వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని.అప్పటి నుంచి ఇలా వినాయకుని విగ్రహం చెంత మురుగు నీరు పారుతుందని, నీరు చింది మండపంపై పడకుండా మండపానికి నీటికి మధ్య మట్టితో ఒక కట్ట కట్టమని అయినా వాహనాలు వేగంగా వెళుతున్న సమయంలో నీరు చింది మండపంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులపై పడుతుందని,దీంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారని వారు ఆరోపించారు.వెంటనే ప్రజాప్రతినిధులు,అధికారులు స్పందించి డ్రైనేజ్ మురుగు పొంగి పొర్లకుండా తగిన చర్యలు చేపట్టాలని భక్తులు,బస్తీ వాసులు,నిర్వాహకులు కోరుతున్నారు.

