దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్‌లను జనసేన నేతలు తాళ్లూరు జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, బెల్లంకొండవారిపాలెం మాజీ సర్పంచ్ పోశం సుమలత,శ్రీకాంత్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్‌లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి,
ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ నాయకుడు మానం రమేష్, దోసకాయలపాడు ఎంపీటీసీ గూడా సరస్వతి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

