ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని సాధనకు కృషి చెయ్యాలి – జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మా నాయక్

ఒంగోలు : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలన ఏర్పరుచుకుని సాధనకు చిన నాటి నుండే సరియైన మార్గంలో కృషి చెయ్యాలని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎన్ లక్ష్మా నాయక్ అన్నారు. ఒంగోలు బాగ్యనగర్లో సాంఘిక సంక్షేమశాఖ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ను ఆయన తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వారి అకాడ మిక్ ప్రతిభను ఆరా తీసాడు. భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని కోరారు. చదువే ఉన్నత స్థితికి చేర్చుతుందని అన్నారు. స్టోర్ రూమ్, కిచెన్ క్షున్నంగా తనిఖీ నిర్వహించారు. పరిసరాలు, స్టోరీ, కిచెన్ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, మోను తప్పక పాటించాలని ఆదేశించారు. విద్యార్థులతో కలసి సహపక్తి బోజనం చేసారు. హెచ్ డబ్యు ఓ కె స్వప్నలత, సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *