తాళ్లూరు : జన విజ్ఞాన వేదిక నిర్వహించిన చెకుముకి టాలెంట్ టెస్ట్లో తాళ్లూరు శ్రీ సరస్వతి విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి టాలెంట్ టెస్ట్కు ఎంపిక అయినట్లు ప్రధానోపాధ్యాయుడు శ్రీరామమూర్తి తెలిపారు. 10, 9, 8వ తరగతి విద్యార్థులు పి వెంకట కుమార్ రెడ్ది, బి భవాని శంకర్, అగస్టీన్ ల బృందం విజయం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావటం పట్ల విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, డైరెక్టర్లు గణేష్ రెడ్డి , శంకర్ రెడ్డి, హెచ్ఎం మూర్తి, డీన్ నుభాణి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు. విద్యార్థులను అభినందించారు.
