కనిగిరి నియోజకవర్గంలోని మహిళలకుటైలరింగ్ లో శిక్షణ, నైపుణ్యత,ఆర్థికంగా నిలదొక్కు కొనే
కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కోసం జననీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అమరావతి గ్రౌండ్స్ లో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశారు . ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్వహించారు . ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని శిక్షణ పొందిన 304 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ చేశారు . ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ ……మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు స్వయం ఉపాధికి అవసరమైన వనరులు అందిస్తే ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
మహిళలు కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకుని, తమ కుటుంబాలకు ఆర్థికంగా, అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరుఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నియోజకవర్గంలోని టిడిపి సీనియర్ నాయకులు యువత మహిళలుపాల్గొన్నారు.

