స్వర్గీయ గుర్రం జాషువా 131 జయంతిని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ పి రాజాబాబు గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్రం జాషువా పీడిత వర్గాల పరిస్థితిని ఆనాటి పరిస్థితులను వివరించే విధంగా దేవునికి చెప్పడానికి దగ్గరగా ఉండే విధంగా తలకిందులుగా వేలాడే గబ్బిలాన్ని ఎంచుకొని గబ్బిలం వంటి విప్లవాత్మక రచనను రచించారు అన్నారు. ఈయన తప్ప ఇంకెవరూ రాయలేనంత విధంగా రచనలను కొనసాగించారు అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ తో ఆ రోజులలో పోటీ తత్వం ఉండేది అన్నారు. అణగారిన వర్గాలు దళితులు అనేది మనం చూసే దృక్పథంలో తప్ప తెలివిలో లో కాదని ఆయన అన్నారని తెలిపారు. గుర్రం జాషువా తప్ప వేరే ఎవరూ ఇటువంటి కవితలు రాయలేరని అనిపించుకున్నారన్నారు. ఆయన ఆశయాలు సంస్కరణకు అనుగుణంగా మేధా సంపత్తిని పెంపొందించుకొని ఆత్మనూన్యత భావాన్ని విడనాడి సమాజంలో ముందుండాలని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్. లక్ష్మానాయక్ వివిధ శాఖల అధికారులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
