మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు -సిఐటియు క్లాసులలో జిల్లా ఉపాధ్యక్షలు జి.వి కొండారెడ్డి

మోదీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షలు జి.వి కొండారెడ్డి అన్నారు. దరిశి సుందరయ్య భవనంలో సోమవారం దరిశి,అద్దంకి నియోజక వర్గ సిఐటియు కార్యకర్తల శిక్షణాతరగతులను ప్రారంభించారు. కార్మికులు – రాజకీయాలు అంశంపై ఆయన మాట్లాడుతూ కార్మిక,ఉద్యోగుల జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఇప్పటి వరకు రక్షణగా ఉన్న 44 కార్మిక చట్టాలను తొలగించి 4 లెబర్ కోడ్స్ లను తేవడంతో ఉద్యోగులు కార్మికులపై ఉరితాడులు బిగించిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ చేయడంతో ఉన్న హక్కులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. ఐక్య పోరాటాలు చేయడం ద్వారానే కార్మిక,ఉద్యోగ హక్కులను కాపాడుకుంటామని తెలిపారు. మోదీ ఎన్నికలకు ముందు సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని గుర్తుచేశారు. చిరుద్యోగులైన ఆశా , అంగన్ వాడీ, మున్సిఫల్ , పంచాయితీ , మధ్యాహ్న భోజనం కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చినా అమలు చేయడం లేదని , అమలు కోసం సిఐటియు పోరాడుతుందని తెలిపారు. రోజు,రోజుకి నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నాయని ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని , రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు 65 సంవత్సరాలు నిండిన వారికి పించన్ ఇవ్వాలని అన్నారు‌ . మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవేటికరణ విధానాల వలన ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని పార్లమెంటు లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వేలో తెలిపారని , కార్పోరేట్లు ఆస్తులు పెరిగి దేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయని దేశంలో బిలియనీర్లు 3 సంవత్సరాల క్రితం 104 మంది ఉంటే ఇప్పుడు 240 మందికి పెరిగారని సంపద కొంత మంది శత కోటేశ్వర్లు వద్ద పోగుబడి పోవడంతో దేశం అభివృద్ది కావడం లేదని , అదే కార్పోరేట్ శక్తులకు గత 10 సంవత్సరాలలో 19 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చారని అవేధన వ్యక్తం చేశారు‌. ఈ విధానాలపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబరు 1నుంచి 3 వరకు చలో పార్లమెంటు నిర్వహిస్తున్నామని కార్మిక,ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సిఐటియు జిల్లా నాయకులు సి.హెచ్ మజుంధర్ మధ్యాహ్నం జరిగిన కార్మిక పోరాటాలు – ప్రభుత్వ విధానం అంశంపై మాట్లడుతూ
కాంట్రాక్టు , ఆవుట్ సోరింగ్ , మున్సిఫల్ ఉద్యోగాలను ఆప్కాస్ నుంచి తొలగించి పాత కాంట్రాక్టు విధానాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, టైం స్కేల్ ఉద్యోగులను ప్రభుత్వం హామీ మేరకు పర్మినెంటు చేయాలని సిఐటియు పోరాడుతుందని ఆయన పిలుపునిచ్చారు.

ఈ శిక్షణా తరగతులకు అద్దంకి సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా
సిఐటియు దరిశి మండల కార్యదర్శి ఉప్పు నారాయణ , తాండవ రంగారావు, గర్నిపూడి జాన్ సామ్యేల్ , సందు వెంకటేశ్వరరావు, రత్నకుమారి , తిరపతమ్మ, జయమ్మ , గోగు వెంకయ్య , ఆదినారాయణ, కోటయ్య , గుడిమెట్ల ఆదాం, సుబ్బయ్య , పి.అరుణ , కె.పద్మా , దాసు, ఇస్రాయిల్, చలమయ్య, గుంటు బాల గురవయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *