ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించారు . పట్టభద్రుల ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థి, జనసేన పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, రాష్ట్ర నాయకులు మచ్చా సుధాకర్, దామోదర్ రెడ్డి, మీసాల శ్రీనివాసరావు, రాము యాదవ్, మండపాక కావ్య, ప్రేమ్ గాంధీ, రవీష్, మిరియాల రామకృష్ణ, బండి నరేష్, గాదె ప్రుద్వీ, కరాటే ప్రభాకర్, బెక్కం జనార్దన్, డా.రాజేంద్రప్రసాద్, గడ్డం రాకేష్, సునీల్, అమంచి, రవితేజ, జిల్లా నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు . నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పట్టభద్రులతో మమేకమై పట్టభద్రుల ఓటరు నమోదు, సంస్థాగత సన్నద్ధత, పట్టభద్రుల సమస్యలపై పరిష్కారం దిశగా పనిచేయాలని వక్తలు స్పష్టం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: