తాళ్లూరు: కొర్రపాటి వారి పాలెంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజి నిర్మాణానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ల తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. …అభివృద్ధి సంక్షేమ పాలన నమపాళ్లలో జరగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా నడిపిస్తున్న తీరును వివరించారు. పార్టీ జెండా దిమ్మెను ఆవిష్కరించారు. వినాయక చవితి సందర్భంగా టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన గణనాధుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి ఆధ్వర్యంలో గౌత్రనామార్చన చేసారు. మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఏఎంసీ చైర్మన్ డిఎన్ సుబ్బా రావు, రాష్ట్ర నాటక రంగ కార్పోరేషన్ డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, మానం రమేష్ బాబు, రైతు సంఘ అధ్యక్షుడు కైపు రామ కోటి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, కొర్రపాటి వేణు, శేఖర్, రామయ్య, యలమంద రావు, సుధాకర్, కళ్యాణ్ చక్రవర్తి ఇడమకంటి నుబ్బా రెడ్డి, నవులూరి విద్యాసాగర్, బడే, నత్యం, క్టస్టర్ ఇన్చార్జిలు రాచకొండ వెంకట రావు, కైపు నాగార్జున రెడ్డి, తూము శివనాగి రెడ్డి, పోశం శ్రీకాంత్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మేడగం నుబ్బా రెడ్డి, నియోజక వర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రావినూతల పరిశుద్దరావు తదితరులు పాల్గొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip: