జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మంగళవారం ఒంగోలు నియోజకవర్గంలోని దశరాజు పల్లి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ( ఎం.ఎస్.ఎం.ఈ ) పార్కును సందర్శించారు. ఇందులో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పురోగతిని తనిఖీ చేశారు. ఈ పార్కులో అవసరమైన డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు వివరించారు. రోడ్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని, తారువేయాల్సి ఉందని చెప్పారు. విద్యుత్ సదుపాయాలను కూడా పూర్తి చేయాల్సి ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఆమె స్పందిస్తూ త్వరగా వీటిని అందుబాటులోకి తెచ్చేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంట ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, ఇతర అధికారులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: