సికింద్రాబాద్,అక్టోబర్ 10 (జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల (అలుమ్ని) ఆడిటోరియంలో ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఆర్థోపెడిక్ బోధనా సదస్సు శనివారం ఘనంగాప్రారంభమైంది. అక్టోబర్ 10, 11 తేదీల్లో కొనసాగే ఈ ప్రత్యేక వర్క్‌షాప్‌లో ప్రముఖ వైద్యులు ఎంవీ రెడ్డి రచించిన ఆర్థోపెడిక్ పుస్తకాన్ని అకాడమిక్ డీఎంఈ డాక్టర్ ఎ. రమాదేవి ముఖ్య అతిథిగా హాజరైఆవిష్కరించారు. వైద్య
విద్యార్థులకు, యువ వైద్యులకు ఇలాంటి ప్రామాణిక గ్రంథాలు క్షేత్రస్థాయిలో ఎంతో ఉపకరిస్తాయని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.పీజీ వైద్య విద్యార్థులకు క్లినికల్ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సా పద్ధతులు, రేడియాలజీ, వార్డ్ రౌండ్స్‌తో పాటు రోగుల సమగ్ర సంరక్షణపై ప్రత్యక్ష నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 40 మంది నిపుణులైన అధ్యాపకులు హాజరై మార్గదర్శనం చేస్తుండగా, రాష్ట్ర నలుమూలల నుంచి 260 మంది ప్రతినిధులు (డెలిగేట్స్) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, వ్యవస్థాపకులు విజయరామారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సదస్సు చైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రొఫెసర్ డాక్టర్ బచ్చు శ్రీనివాస్ వ్యవహరించగా, తోసా (TOSA) ప్రతినిధులు ఆళ్వార్ రెడ్డి, తిమ్మారెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, టికాస్ (TCOS) ప్రతినిధులు ప్రొఫెసర్లు డా. పి.ఎల్. శ్రీనివాస్, డా. రాజీవ్, డా. ప్రభుధీర్, డా. శేఖర్‌లతో పాటు గాంధీ ఆర్థోపెడిక్ విభాగానికి చెందిన ప్రస్తుత, పూర్వ అధ్యాపకులు పాల్గొని కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో సీనియర్ వైద్య నిపుణులు పీజీ విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ, మార్గదర్శనం అందించనున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: