ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతైన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు – పాకల బీచ్‌లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు

సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు అలల ఉధృతికి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురుని స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు కాపాడారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ సంఘటన ఒక దురదృష్టకరమని, విచారం వ్యక్తం చేశారు. కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామం నుండి సుమారు 70 మంది తమ ఆచారం ప్రకారం పోలేరమ్మ జాతర జరుపుకొని, సముద్ర స్నానం చేయడానికి పాకల బీచ్‌కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా ఒక రిప్ కరెంటు పెద్ద అల వచ్చి కొందరిని లోపలికి లాక్కెళ్ళిందని, పరిస్థితిని గమనించిన స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసు వెంటనే స్పందించి బోట్ల ద్వారా కొంతమందిని రక్షించారన్నారు.

మృతులు, క్షతగాత్రుల వివరాలు: మృతులు :  పాలడుగు తేజ (20 ఏళ్లు), బత్తుల మహేష్ బాబు (22 ఏళ్లు ).

  • గల్లంతయిన వారు: దేవల విష్ణు(19 సం) మరియు దేవల నారాయణ (27 సం).
  • చికిత్స పొందుతున్నవారు: మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహ

గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం సంబంధిత శాఖల సమన్వయంతో డ్రోన్లు, పడవల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలందరూ పోలీసు సిబ్బంది సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సముద్రంలో అలల ఉద్ధృతి, ఆటుపోట్లను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సముద్రంలో స్నానాలు చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. సముద్రంలోకి వెళ్లవద్దని పోలీసులు సూచించిన ప్రాంతాల్లో స్నానాలు చేయడం, లోతైన నీటిలోకి వెళ్లడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ శ్రీహరి, మెరైన్ ఇన్స్పెక్టర్ శివన్నారాయణ, సింగరాయకొండ ఎస్సై సుధీర్ కుమార్ మరియు సిబ్బంది ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *