పాకల బీచ్ లో విషాదం -సముద్ర స్నానానికి వచ్చి ఇద్దరు మృతి -అలల ఉధృతికి ఇంకో ఇద్దరు గల్లంతు -ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు -ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సింగరాయకొండ :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

         సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో శనివారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు అలల ఉధృతికి మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురుని స్థానిక మత్స్యకారులు, పోలీసులు కాపాడారు. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాద తీరు, మృతుల వివరాలను వివరించారు.
            కనిగిరి మండలం శ్రీరంగపురం గ్రామం నుండి సుమారు 70 మంది తమ ఆచారం ప్రకారం పోలేరమ్మ జాతర జరుపుకొని, సముద్ర స్నానం చేయడానికి పాకల బీచ్‌కు వచ్చారు. అక్కడ స్నానం చేస్తుండగా ఒక పెద్ద అల వచ్చి కొందరిని లోపలికి లాక్కెళ్ళిందని ఆ బృంద సభ్యులు చెప్పినట్లు
తెలిపారు. పరిస్థితిని గమనించిన స్థానిక మత్స్యకారులు, పోలీసు టవర్ వద్ద ఉన్న పోలీసులు వెంటనే స్పందించి బోట్ల ద్వారా కొంతమందిని రక్షించారన్నారు.

మృతులు, క్షతగాత్రుల వివరాలు:

  • మృతులు :  పాలడుగు తేజ (20 ఏళ్లు), బత్తుల మహేష్ బాబు (22 ఏళ్లు ).
  • గల్లంతయిన వారు : దేవల విష్ణు మరియు దేవల నారాయణ.
  • చికిత్స పొందుతున్నవారు: మనోజ్ కుమార్, మహేష్ తేజ, నరసింహ. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

              ప్రస్తుతం జి.జి.హెచ్ (ఒంగోలు), కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రి మరియు ఒంగోలు రమేష్ ఆసుపత్రులలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందుతోందన్నారు. పోలీసు యంత్రాంగం మరియు మత్స్యకారులు గల్లయిన వారి ఆచూకీ కోసం డ్రోన్లు మరియు పడవల సహాయంతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. బీచ్ కు వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని, భద్రతాపరంగా పోలీసు సిబ్బంది చేసే సూచనలను పాటించాలని కలెక్టర్ కోరారు.
అనంతరం కందుకూరు కోటారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరసింహను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ఎలాంటి ప్రమాదము లేదని వైద్యులు తెలిపారు. ఈ సమయంలో కలెక్టర్ వెంట కందుకూరు సబ్ కలెక్టర్ డి.హిమవంశి, కందుకూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *