హైదరాబాద్ అక్టోబర్ 10,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
ప్రజల ఆహ్లాదం, వినోదం కోసం ఏర్పాటుచేసే ఎగ్జిబిషన్లు, మేళాల నిర్వాహణ, ఏర్పాట్లు అన్ని రకాల అనుమతులు తీసుకొని నిర్వహించాల్సి ఉంటుంది. కొంతమంది నిర్వాహకులు ఎలాంటి అనుభవం, గతంలో ఎగ్జిబీషన్లు నిర్వహించిన అనుభవం లేకుండా, అనుమతులను పక్కన పెట్టి ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. ఫైర్, ప్రజల సేఫ్టీ, నిబంధనలకు అనుగుణంగా
పార్కింగ్ సదుపాయం, అనుకొని ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ఫైర్ ఇంజన్ తిరిగేదుకు తగిన సదుపాయాలు, ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసే ఎమ్యూజ్మెంట్ రైడ్స్ ఇతరత్రా అన్నింటి విషయంలో సేఫ్టీ తీసుకోవాలి.
గతంలో నగరంలో అనుమతులు సరిగ్గా లేకుండాఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లను నిలిపివేసిన సంఘటనలు ఉన్నాయి. ఎల్బీనగర్ రింగ్ రోడ్డుకు వెళ్లే ప్రధాన రోడ్డులో కామినేని హాస్పిటల్ సమీపంలో ప్లై ఓవర్ పక్కనఏర్పాటుచేస్తున్న ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్ కు సరైన అనుమతులు లేకుండానే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇలాంటి ఎగ్జిబిషన్ల నిర్వాహణ పై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి నిర్వహణకు
అన్ని రకాలైన అనుమతులు ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగితే ఎవ్వరు బాధ్యత తీసుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి, ఆహ్లాదాన్ని ప్రమాదంగా మారకుండా చూడాలని కోరుతున్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: