దర్శి: దర్శి ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 41 మంది వర్కర్ల మరోమారు ఆందోళన బాట పట్టారు . వీరికి 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం లో వొద్ద నిరసన తెలిపి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు. గతంలో సమ్మె చేసినప్పుడు జిల్లా కలెక్టర్ మూడు రోజుల్లో జీతాలు చెల్లించాలని ఎస్ఈని ఆదేశించారని, ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ జీతాలు ఇవ్వలేదని, పైగా అవమానకరంగా మాట్లాడుతూ చులకనగా చూస్తున్నారని వాపోయారు. రెండు రోజుల్లో జీతాలు చెల్లించి తమ కుటుంబాలను కాపాడాలని విన్నవించారు.
వీరికి సీపీఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం.రమేష్ బాబు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.కరుణానిధి, ఏఐటీయూసీ నాయకులు జూపల్లి కోటేశ్వరరావు మద్దతు తెలిపారు. జీతాలు వచ్చే వరకు కార్మికుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: