ముండ్లమూరు : ఆదరించండి ముండ్లమూరు మండలాన్ని అభివృద్ధి చేస్తానని వైయస్సార్ సిపి జడ్పిటిసి అభ్యర్థి చింతా వెంకట శేషా లక్ష్మి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం పులిపాడు, బృందావనం తండా, జగత్ నగర్, నందమూరి నగర్, పలుకురాళ్ల తండా, నందమూరి నగర్, ఉల్లగల్లు, రెడ్డి నగర్, తదితర గ్రామాలలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె పేరుపేరునా గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: