సింగరాయకొండ : జాతీయ రహదారి -16 రోడ్డుపై స్వీట్ల లోడుతో వెళ్తున్న ఒక కార్గో వ్యాన్ అగ్నిప్రమాదానికి గురై మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన సింగరాయకొండ జాతీయ రహదారి ఎమర్జెన్సీ రన్ వే కుంభకోణం కేఫ్ సమీపాన సోమవారం చోటుచేసుకుంది.వివరాల్లోకేళ్తే విజయవాడ నుండి చెన్నై వైపు స్వీట్ల లోడుతో వెళ్తున్న ఆర్ఎస్ఆర్ ఎక్స్ప్రెస్ కార్గో’కు చెందిన ఏపీ 39 డబ్ల్యు ఆర్ 9072 ఏ సి టాటా బడా దోస్త్ వాహనం ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై వాహనంలో అకస్మాత్తుగా పొగలు రావడాన్ని డ్రైవర్ ప్రవీణ్ గమనించి వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రహదారి పక్కకు నిలిపివేసి కిందకు దిగాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది.సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది, సింగరాయకొండ సీఐ శ్రీహరి,పోలీసులు మరియు టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు, స్థానికులు కలిసి వాహనంలో ఉన్న సుమారు 70 శాతం లోడును సురక్షితంగా బయటకు తీయగలిగారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించటం వలన ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సింగరాయకొండ సీఐ శ్రీహరి ఘటనా స్థలాన్ని పరిశీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: