మహంకాళి జిల్లాబీ జే పీ ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ నేతృత్వం…బేగంపేట నుంచి అమీత్ షా పాదయాత్రకు బయలుదేరిన బీ జే పీ శ్రేణులు….

బేగంపేట నవంబర్ 2,(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
మహంకాళి జిల్లా బీ జే పీ ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ నేతృత్వంలో
బేగంపేట నుంచి అమీత్ షా పాదయాత్రకు పెద్ద సంఖ్యలో బీ జే పీ శ్రేణులు తరలి వెళ్లాయి.జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి మోజంజాహి మార్కెట్ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు నిర్వహించిన “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – అరాచకాలను తొలగించండి” అనే పాదయాత్రలో బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు, బీ జే పీ శ్రేణులు తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సి. విజయ్ కుమార్, అశోక్ యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు టి. శ్రవణ్, బాబురావు, మైసూర్ మధుసూదన్, జె. ఆనంద్, పాండియన్, క్రాంతి, యాదగిరి, అభిషేక్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *