బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు: సికింద్రాబాద్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి.

హైదరాబాద్ నవంబర్ 2, (జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
బాణాసంచా దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు సికింద్రాబాద్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు.
తాత్కాలిక, శాశ్వత బాణసంచా దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి హెచ్చరించారు. అంబర్‌పేట్‌లోని మహారాణా ప్రతాప్‌ ఫంక్షన్‌ హాల్‌లో చిలకలగూడ ఏసీపీ ఆధ్వర్యంలో బాణసంచా వ్యాపారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడుతూ, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అన్ని అనుమతులు పొందిన తర్వాతే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.ప్రతి దుకాణంలో అగ్నిమాపక పరికరాలను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, నిర్దేశిత పరిమితికి మించి టపాసులను నిల్వ చేయకూడదని ఆమె ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ అత్యంత సురక్షితమైన వాతావరణంలో మాత్రమే విక్రయాలు సాగించాలని సూచించారు. ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేసిన ఈ సమావేశంలో పలు ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, పోలీసు అధికారులు, బాణసంచా విక్రయదారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *