హత్యకు కుట్ర భగ్నం ఐదుగురు నిందితుల అరెస్ట్,మారణాయుధాలు స్వాధీనం

హైదరాబాద్ నవంబర్ 2 (జేఎస్ డీ ఎం న్యూస్ ) :
నగరంలో ముఠా కక్షలు భగ్గుమనేలా పన్నిన దారుణ హత్య కుట్రను మల్కాజ్ గిరి పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఉప్పల్ పోలీసులు, ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఐదుగురు నిందితులను
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఉప్పల్ శిల్పారామం సమీపంలో కొందరు వ్యక్తులుఅనుమానాస్పదంగా సంచరిస్తూ హత్యకు పథకం రచిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఉప్పల్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్వోటీ బలగాలు సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు దేశవాళీ తుపాకులు, ఎనిమిది రౌండ్ల బుల్లెట్లు, మూడు కత్తులతో పాటు రెండు స్కూటర్లు, ఒక ఆటో రిక్షా, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు సమయస్ఫూర్తితో సకాలంలో స్పందించి ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రాణనష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, అనుమానిత కదలికలపై నిరంతర నిఘా ఉంచుతూ ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని కమిషనర్ స్పష్టం చేశారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *