హైదరాబాద్, నవంబర్ 7 (జే ఎస్ డీ ఎం న్యూస్ )
అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్, జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ (JNJHS) సభ్యుడు అవ్వారి రఘు అందరికీ ఆత్మీయులని పలువురు సీనియర్ జర్నలిస్టులు నివాళులర్పించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్, ఉదయం ఉద్యోగుల ఆధ్వర్యంలో రఘు సంస్మరణ సభ శనివారం ప్రెస్ క్లబ్ లో జరిగింది. సభకు హాజరైన జర్నలిస్టులు రఘు తో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
చివరివరకూ విలువలతో కూడిన జర్నలిజం చేసిన వ్యక్తి జర్నలిస్ట్ రఘు అని కొనియాడారు. మీడియా సంస్థల్లో ఇమడలేక సొంతంగా ఆర్ ఎన్ ఏ న్యూస్ ఏజెన్సీ ప్రారంభించి పత్రికలకు అండగా నిలిచారన్నారు. జీవితాంతం జర్నలిజానికి సేవలు చేసిన అవ్వారి రఘుకి జర్నలిస్టు సంఘాలు అండగా నిలవక పోవటం బాధాకరమని అన్నారు. రఘు కుటుంబానికి సహకరించిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కి ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్, సీనియర్
జర్నలిస్టులు మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి,
హేమసుందర్, సైదా రెడ్డి, బాల భాస్కర్, JNJHS డైరెక్టర్లు రమణా రావు, అశోక్ రెడ్డి, ట్యాంక్ బండ్ రాములు, కే.ఎన్.భాస్కర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ బట్టిపాటి రాజశేఖర్, మహిళా జర్నలిస్టులు అరుణ, యశోద, ఉమ, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: