బేగంపేట నవంబర్ 7(జే ఎస్ డీ ఎం న్యూస్ ) :
అర్ణబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో పునరుద్దరణకు శ్రమించిన సికింద్రాబాద్ సర్కిల్ ప్యారడైజ్ డివిజన్ లోని ప్యారడైజ్ సెక్షన్ సబ్ ఇంజనీర్ దుర్గేష్ ను డివిజనల్ ఇంజనీర్ సురేష్ ఘనంగా సత్కరించారు.
సికింద్రాబాద్ ఎస్ ఈ వేణుగోపాల్ అదేశాల మేరకు సికింద్రాబాద్ సర్కిల్ నుండి ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి వీరవరం సెక్షన్ లో విద్యుత్ సరఫరా పునరద్దణ పనులకు నగరానికి చెందిన విద్యుత్ శాఖకు చెందిన టీం లు వెళ్లాయి. ప్యారడైజ్ డివిజన్ నుండి సబ్ ఇంజనీర్ దుర్గేష్ వెళ్ళి సేవ చేసినందుకు డివిజనల్ ఇంజనీర్ దుర్గేష్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏడి ఈ శివదుర్గాప్రసాద్ సికిందరాబాద్ సర్కిల్ ఆఫీస్ కమర్షియల్ ఎ డి ఈ మాలతీ. పి ఓ సరిత యం ఆర్ టి ఎ డి ఈ మరియు ఏ ఈలు శివరామకృష్ణ రవికుమార్ తో పాటు 1104 యూనియన్ నాయకులు ప్రభాకర్ అరుణ్ శ్రీనివాస్ రాహుల్ తో పాటు ఇంజనీర్లు మరియు ప్యారడైజ్ సెక్షన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: