ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాల పోరుబాట -కనిగిరిలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ -ఎన్నికల్లో దౌర్జన్యాలను అరికట్టాలి.. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలి

కనిగిరి: స్థానిక ఎన్నికల్లో కూటమి శ్రేణులు పాల్పడిన దౌర్జన్యాలు, ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలను నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం ఇచ్చిన రాష్ట్రవ్యాప్త నిరసన పిలుపులో భాగంగా బుధవారం కనిగిరి పట్టణంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పరిరక్షణకు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అయితే నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో కనిగిరి సీఐ సుబ్రహ్మణ్యం పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకుని ర్యాలీని అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తూ మైకును లాక్కోవడంతో వామపక్ష నాయకులు, పోలీసుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పి.సి. కేశవరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాల్సి ఉండగా అధికార బలంతో ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు లేకుండా స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని ఎన్నికల వ్యవస్థ కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వామపక్ష నాయకులు పలు డిమాండ్లను వినిపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎన్నికల స్వతంత్ర వ్యవస్థను పరిరక్షించాలని, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రభుత్వం, ఎన్నికల అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఏడుకొండలు, నరేంద్ర, ప్రసంగి, వెంకటయ్య, ఇమ్మానియేల్, జయపాల్, జేమ్స్, వెంకటమ్మ, శాంతకుమారి, రుఫియా, ఆదిలక్ష్మి, రత్తమ్మ, మల్లేశ్వరి, ఎలిషమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నాయకులు మోహన్, , రామయ్య, బసిరా తదితరులు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *