చీమకుర్తి: చీమకుర్తి లైన్స్ క్లబ్ ఆఫ్ గెలాక్సీ వారి ఆధ్వర్యంలో ఇలపావులూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విజయ్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ విజయకుమార్ ఉచిత వైద్య పరీక్షలు చేసి, విద్యార్థులకు టూత్ పేస్ట్ లు , బ్రష్ లు , డెంటల్ హెల్త్ కార్డులు అందజేశారు. డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు వయసు కలిగిన విద్యార్థిని విద్యార్థులకు దంత పరీక్షలు, ఉచిత దంత స్కాన్ ను పొందగలరని తెలిపారు. ప్రతి విద్యార్థికి విద్యతోపాటు ఆరోగ్య సంరక్షణ చాలా అవసరమని అన్నారు. పిల్లలు తమ దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనురాధ, లైన్స్ క్లబ్ అధ్యక్షులు చలువాది పార్థసారథి, లైన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు మాడపాకుల రాజా, లైన్ చలువాది శ్రీనివాసరావు, పాఠశాల హెడ్మాస్టర్ ఎం మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, అపర్ణ, రాజ్యలక్ష్మి, రాఘవ రామ్, సంజీవరావు, కిషోర్, జానకిరామ్, ఆషాబి తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: